Saturday, July 28, 2018

పరోపకారము

తప్పులెంచక మంచిమరువక
లాభంచూడక ప్రేమపంచుతూ 
మంచుముద్దవోలె మనసునిమార్చి 
పరోపకారము సేయర సారధీ! 

అమ్మ

చిరుజల్లు కాదిది మంచు వెనక దాగిన జలపాతం
తుంపర కాదిది కరిమబ్బు ధరిత్రికి పంపిన ప్రేమలేఖ
చల్లగాలి కాదది వరిపైరు పంపిన పుట్టింటి ఆహ్వానం
వీటిమధ్య ఆహ్లాదం కాదునాది అమ్మను చూడబోతానన్న సంతోషం

Tuesday, July 17, 2018

మబ్బుల నడక

ఆకుపచ్చని మొక్కల మధ్య తేటతెల్లని నవ్వుల పూత...
పసుపుపచ్చని కిరణాల నడుమ స్వర్ణ వన్నె మబ్బుల నడక...
సప్త వర్ణ నవ్వుల చివర మిలమిలమెరిసెనోతార...

అధరామృతం

ప్రేమ నావలో విహరిస్తూ నీ బిగికౌగిలి వెచ్చదనం లో సుడుల కురుల పరిమళాన్ని ఆస్వాదిస్తూ గతితప్పిన యెదసవ్వడులు వింటూ నీ అధరామృత ధారలలో తడుస్తున్నాను

Friday, July 13, 2018

అందం

మబ్బు చాటున ఆకాశం...ముసుగు మాటున నీ అందం...
జాలువారెను ఆ మేఘం...తరించెను ఆ వన్యం...
తనివి తీరని నీ అందం...తెర తీయవా నాకోసం...

అతిశయం

ఆహా నీ సోగ కనుల మిలమిలలు...
                    కానరావే నిశీధి నడి రాతిరి చుక్కలలో...
యెమిలే ఆ వాలు జడ వయ్యారాలు...
                    సాటి రావే ఆటుపోట్ల అలల అలజడులు...
మరపురాని నీ మాటల మధురిమలు....
                       పలుకగలవా ఆ సరిగమలు...  
అతిశయమే నీ రూపం...
            పొందగలదా అత్యద్భుత శిల్పం...

విరామం

మార్పు తథ్యం... మరపు కష్టం...

ప్రేమ నిజం... బాధ నిత్యం...

దూరం భారం... దగ్గర మిథ్యం...

మౌనం మిత్రం... నవ్వు అబద్దం...

మధ్యన అగాధం... తప్పదు విరామం...

అమ్మ

చూసెనంట ఏడుపుల నిన్ను... నవ్వెనంట సుందర మోము...
చేసేనంట ఒంటిని పరుపు...నేర్పెనంట మెత్తటి నడక...
తీర్చెనంట ఆకలి ఏడుపు...మరిచెనంట ఆకలి కడుపు...
పెరుగుతోంది తీరని రుణం... చాలదట ఇచ్చినా ప్రాణం...
వెలిగించింది  నీ జీవన జ్యోతి... కరిగించింది తన నెత్తుటి ముసురు

ఆరాటం

దారి తెలియని నావని..నడిసంద్రాన అలలు ఊపిరాడనివ్వట్లేదు..
ఒడ్డు లేదని తెలిసినపుడు..ఆరాటం కన్నా మునకే నయం...

భయం

నీ నవ్వు నాకు ప్రియం..నీ కోపం నాకు భయం..

పల్లె వెలుగు

అభివృధి కాదిది అనర్థం
చూపు ఆకాశం వైపు నడక అగాధం లోతు
మరిచాము భూమిని
మోపాము ఉక్కు పాదాన్ని పుడమి తల్లి గుండెపై  
గడిచినై చాన్నాల్లు తెలియక
జోరు నడక సాగించనీ చరిత్ర వైపు పల్లె వెలుగు కోసమ్

బృందావనం

వినీలాకాశం లో నీలి మేఘాల మెత్త పై చల్లని గాలిలో సేదతీరుతున్న పక్షిలా...   
విశాల సంద్రాన తేలియాడుతూ పైనెగురుతున్న పక్షిని చూస్తున్న బుడగలా...
బుడగలతో ఆడుకుంటూ ఆనంద వీధులలో విహరిస్తున్న బుడుగులా...         
నా మనసు ఆ బృందావనంలో తేలుతూ సేదతేరుతూ విహరిస్తూంది!

మళ్ళీరావా...

భువి ధరించిన తారలా తోచావు, ఇరుకునపడి మసులుతున్న నాకు.
నేల జారాను తక్షణం,మాయమయ్యావు మరుక్షణం.
చినుకు ముక్కలై తరుణి మొత్తం తిరిగాను నినుకానలేక.
నిను వెదకని దరి లేదు, లోన తలువని క్షణం లేదు. 
అచేతనంగా సంద్రాన కలిసి ఆవిరయ్యను. 
మరుజన్మనైనా నిను చేరగల దారిచూపవా! 

కల

ఇది కలయా?, నిజమైతే, ఆది కదా స్వర్గము!
కలయందే వచ్చెదవంటే, కాల చక్రం లో కలల గర్భం లో బంధీగా ఉండుటకు సిద్దంగా ఉన్నాను! 

యెడబాటు

హిమాలయ లోయలో హోయలుపోతున్న సెలయేరు ప్రస్పుటంగా చూపుతున్న అట్టడుగు రాళ్ళలాగా నీ అంతరంగిక భావాలను పలికించేవి నీ హావభావాలు... 

చల్లటి కొండ మీద పరుచుకున్న నల్లటి మబ్బు కురిపిస్తున్న చిరుజల్లుని  ఆస్వాదిస్తున్న పచ్చని చిగురుటాకులాగా నీ చల్లని మాటల జల్లులలో పులకరించేది నామది...

విశాల తీరాన అవిశ్రాంత సాగరం లాగా ఉప్పొంగగల నా హృదయం  నీ యెడబాటుతో అనంత చీకటిలో నిశ్శబ్ధంతో కబుర్లాడుతున్న సాగర గర్భంలాగా నిశ్చలంగా నిగూఢంగా పడిఉంది...

మిథ్యాలోకం

మత్తెక్కించే నీ కురుల పరిమలం 
ఊగిసలాడి దూకినది నీ పక్షం 
మరోలోకాన్ని పరిచయం చేసే నీ నయనం 
కల్పితం అనుకున్నది తను ఉన్న ప్రపంచం
నీ స్పర్షతో మైమరిచి తిరిగి రానన్నది మిథ్యాలోకాన్ని వదిలి!

ప్రయాణం

చల్లగాలి వేణువులో మెత్తగా గుచ్చుతున్న చినుకుల చిరుజల్లుని చీల్చుకుంటూ నీతో వడి వడి ప్రయాణం అనిర్వచనీయం...
కళ్ళని మూసినా దారిని కప్పేసినా నీ సావాసమిచ్చిన ధైర్యంతో భయం లేక సాగిపొతోంది నా ప్రయాణం...

నీవే..

నీవే...నీవే...
మదితలపున నీవే...
నాపాట ప్రతిపదమున నీవే...
నా కవితాంతర్యం నీవే...
కలలో నీవే, ఇల నలువైపులా నీవే...
నా గమ్యం నీ నవ్వే...నా అన్వేషణ నానువ్వే... 

inspired from #నీవే..

అమృతవర్షిణి

సంజీవని వనాన అమృతవర్షిణి లా...
నిండు జాబిలి వెలుగున సన్నజాజి పువ్వు లా...
జానపదాన పలికిన పల్లె పదం లా...
వసంతాన కూసిన కొకిలమ్మ లా...
జతైనది ఆ నవ్వు నీ అందానికి...

Entwined

  I am trapped, confronting you at every turn. I feel lost, tracing your footsteps along every way. Contemplating the departure from your m...