మత్తెక్కించే నీ కురుల పరిమలం ఊగిసలాడి దూకినది నీ పక్షం మరోలోకాన్ని పరిచయం చేసే నీ నయనం కల్పితం అనుకున్నది తను ఉన్న ప్రపంచం నీ స్పర్షతో మైమరిచి తిరిగి రానన్నది మిథ్యాలోకాన్ని వదిలి!
చల్లగాలి వేణువులో మెత్తగా గుచ్చుతున్న చినుకుల చిరుజల్లుని చీల్చుకుంటూ నీతో వడి వడి ప్రయాణం అనిర్వచనీయం... కళ్ళని మూసినా దారిని కప్పేసినా నీ సావాసమిచ్చిన ధైర్యంతో భయం లేక సాగిపొతోంది నా ప్రయాణం...